రోజాకు ఊహించని పదవి అప్పగించిన జగన్…?

Sunday, June 9th, 2019, 03:43:49 PM IST

ఏపీకి కొత్తగా ముఖ్యమంత్రి అధికారాన్ని దక్కించుకున్న జగన్ చివరికి తన మంత్రులతో క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు… జగన్ ఆలా మంత్రులను ప్రకటించడంతోనే వైసీపీ ఎమ్మెల్యేలలో అధికశాతంలో అలకలు ప్రారంభమయ్యాయి… ఎలాగైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఎన్నికలకు ముందు నుండే నమ్మకంగా ఉన్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా కి మొండి చెయ్యి మిగిలింది. పాపం చివరి వరకు కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా రోజా కి మంత్రి పదవి దక్కలేదని తన అభిమానులందరూ కూడా నిరాశకు గురయ్యారు… దీంతో క్యాబినెట్ ప్రమాణస్వీకారంలో కూడా రోజా కనిపించలేదు. అయితే, రోజాను బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.

అయితే రోజా కి ఆర్టీసీ చైర్మన్ పదవిని అప్పగిస్తామని జగన్ చెప్పారని, అందుకు రోజా కూడా సంతృప్తిగానే ఉందని వినికిడి… అయితే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులకు నామినేటెడ్ పదవులను అప్పగించడంల ఉన్నటువంటి రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రోజా కి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్ లా ఉంచారని సమాచారం. అన్ని సరిగా సెటిల్ అయితే త్వరలోనే రోజని ఎదో ఒక పదవిలో చూడొచ్చని తెలుస్తుంది.