ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ బిగ్ షాక్..!

Monday, June 3rd, 2019, 04:24:01 PM IST

ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో అస్సలు ఎవ్వరూ ఊహించని రీతిలో కనీ వినీ ఎరుగని విధంగా వైసీపీ అధినేత జగన్ విజయ ఢంకా మోగించారు.ఏకంగా 151 స్థానాలు తన ఖాతాలో వేసుకునే సరికి ఒక్కసారిగా ఇతర పార్టీల శ్రేణులకు అసలు ఏం జరిగిందో అర్ధం కాలేదు.మొత్తానికి జగన్ దెబ్బ వల్ల తెలుగుదేశం పార్టీకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలు అలాగే జనసేన పార్టీకు ఒకేఒక ఎమ్మెల్యే మిగిలారు.అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించేసారు.ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ కు తీవ్ర ఆగ్రహం వచ్చింది.ఇప్పుడు అదే ఆగ్రహాన్ని టైం చూసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై తీర్చుకుంటున్నారా అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చిన్న టాపిక్ నడుస్తుంది.

అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బ దెబ్బ తినే సరికి ఆ పార్టీ నుంచి వైసీపీలోకి చేరిపోయేందుకు ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్న వార్త జగన్ కు తెలిసింది.అలాగే వారు వైసీపీలో ఉండే కొంతమంది కీలక నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నారని తెలిసింది.అయితే ఆ ముగ్గురుకి జగన్ తనదైన స్టైల్ లో షాకిచ్చారట.పార్టీలోకి వస్తాను అంటే తాను కాదనని కానీ తన పార్టీలోకి చేరే ముందు తెలుగుదేశం పార్టీకి వారు శాశ్వతంగా రాజీనామా చేసి వస్తే తప్ప తన పార్టీలోకి వారు రావద్దని నో ఎంట్రీ బోర్డు పెట్టేసారట.దీనితో వారికి ఎటు పోనీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.