బిగ్ బ్రేకింగ్ : అప్పుడే ఆ మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగ్..!

Tuesday, June 11th, 2019, 10:52:31 AM IST

ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఈ కొద్ది రోజుల్లోనే అధికారులను పరుగులు పెట్టిస్తూ తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇదే సందర్భంలో జగన్ తన క్యాబినెట్ లోని మంత్రులుగా ఎవరు ఉండబోతారు అన్న అంశం కూడా చాలా రోజుల వరకు పెద్ద సస్పెన్స్ గా ఉంచారు.దానితో అసలు జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా ఎవరు ఉంటారా అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో నెలకొంది.

అలా ఉండగానే జగన్ తన మంత్రుల జాబితాను విడుదల చేయగా కొంతమందికి ఆనందం కొంతమందికి నిరాశ మిగిల్చారు.ఇదిలా ఉండగా కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారికి మాత్రం జగన్ అప్పుడే దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జగన్ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒకే మాట మీద కట్టుబడి ఉన్నారు.జగన్ అనే వ్యక్తి అధికారంలోకి కనుక వస్తే అవినీతి అనేది లేకుండా చేస్తాడు అన్నప్పుడు చాలా మంది నవ్వి ఊరుకున్నారు.

ఇప్పుడు అలాంటి వారి అందరి నోరు మూయించేలా జగన్ తన మంత్రులకే సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్న ఏ ఒక్కరు కానీ అవినీతికి పాల్పడ్డారన్న సంగతి కనుక తెలిస్తే అస్సలు ఉపేక్షించేదే లేదు అని ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడడానికి వీలు లేదని అలా ఎవరైనా అవినీతి చేసారని తెలిస్తే రెండు రోజుల్లోనే ఆ మంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తానని చెప్పినట్టు సమాచారం.దీనితో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో మరింత గుబులు పుట్టించిన వారిగా జగన్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు.