రోజాకి షాక్ ఇచ్చిన జగన్ – పాపం మంత్రి పదవి దక్కేలా లేదుగా…?

Friday, June 7th, 2019, 09:18:52 PM IST


ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే… అయితే వైసీపీ పార్టీ పెట్టినప్పటినుండి కూడా సినీ నటి రోజా వైసీపీ లోనే కొనసాగుతూ, జగన్ కి తోడుగానే ఉంటున్నారు. అయితే వైసీపీ తరపున నగరి నుండి పోటీ చేసిన రోజా రెండవసారి కూడా భారీ మెజారిటీతో గెలిచారు. కాగా ఈసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకి ఎలాగైనా మంత్రి పదవి ఖాయం అని అందరు కూడా తేల్చి చెప్పేశారు. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడం చూసి ఆమె అభిమానులు చాలా వరకు నిరాశకు గురయ్యారు…

అయితే రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. అయితే అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో రోజాకు మంత్రి పదవి దక్కలేదని తెలుస్తుంది. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న విషయాల ప్రకారం ఈ మంత్రి వర్గం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత మళ్ళీ కొత్త మంత్రి వర్గం రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు. కాగా రెండవసారి ఏర్పడే మంత్రి వర్గం లో నైనా రోజా కి మంత్రి గా అవకాశం దక్కుతుందా లేదా అనేది ఇప్పటికి కూడా డౌట్ గానే ఉందని చెప్పాలి. అయితే ఏపీకి మంత్రి కావాలని కళలు కన్నటువంటి రోజాకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.