మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్ – ఆలా చేస్తే పదవి అవుట్

Monday, June 10th, 2019, 10:49:11 PM IST

ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తన మంత్రివర్గం నేడు అమరావతిలో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగనమొహం రెడ్డి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా మొదటి సమావేశంలోనే సీఎం జగన్ తన మంత్రులందరినీ కూడా తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి అనేదే ఉండకూడదని, ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని సమాచారం అందితే మాత్రం తక్షణమే వారిని ఆ మంత్రి పదవి నుండి తొలగించి చర్యలు తీసుకుంటారని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తోక జాడిస్తే ఖేల్ ఖతం అంటూ సుతిమెత్తగా డేంజర్ సిగ్నల్స్ పంపారు. అవినీతి అనే పదమే వినబడకూడదని జగన్ హెచ్చరించారు.

అంతేకాకుండా ఎవరు ఏ పదవిలో ఉన్నారని కాదు, తప్పు చేసింది ఎవరైనా కూడా శిక్ష తప్పదని జగన్ హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిపై తక్షణమే విచారణ జరిపి సస్పెన్షన్ వేటు తప్పదనేశారు. కాగా కొత్తగా ఎన్నికైన మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబందించిన ప్రతి నిర్ణయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని, జుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని అసలు రాష్ట్రంలో అవినీతి అనేదే కనపడకూడదని, అవినీతి జోలికి వెళ్లొద్దని మంత్రులను జగన్ హెచ్చరించారని తెలిపారు.