ఈ ఇద్దరిలో జగన్ ఎవరికి మంత్రిగా అవకాశం కల్పించబోతున్నారో తెలుసా..!

Friday, June 7th, 2019, 10:49:48 AM IST

ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు సీఎం జగన్. అంతేకాదు ఈ నెల 8వ తేదిన తన కేబినెట్ ఉండే పేర్లను ప్రకటించి వారితో కూడా ప్రమాణస్వీకారం చేయిస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే అసలు జగన్ కేబినెట్‌లో ప్రస్తుతం ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనేదే ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

అయితే ఇక ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు మాత్రమే గడువు ఉంది. అయితే ఇప్పటికే మంత్రివర్గంలో ఆశపెట్టుకున్న వారిలో మరింత ఉత్కంఠత నెలకొంది. అయితే అందరూ తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఏమిటంటే నగరి ఎమ్మెల్యే రోజాకు అసలు జగన్ మంత్రివర్గంలో స్థానం కలిపిస్తారా. ఒకవేళ స్థానం కలిపిస్తే ఏ శాఖ అప్పచెబుతారు అనే దానిపై తీవ్ర సందేహాలు ఉన్నాయి పార్టీ శ్రేణులలో. అయితే రోజాకు మంత్ర్ పదవి ఇవ్వడంలేదు, స్పీకర్‌గా నియమించబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తాలకు సంబంధించి కాస్త ఆలోచిస్తే అవును నిజమే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే చిత్తూర్ జిల్లా నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఖాయమైపోయింది. అయితే పార్టీలో మరో సీనియర్ నేతగా, మహిళగా రోజాకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్న సమయంలో రోజాకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఏర్పడింది. భూమనకు టీటీడీ చైర్మన్ పోస్టు కట్టబెట్టి ఉంటే రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉండేవని, టీటీడీ చైర్మన్ పోస్టును సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి్‌కి కట్టబెట్టడంతో భూమనకి మంత్రిపదవి రాబోతుందని రోజాను లిస్త్‌లో నుంచి తప్పించి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారట. అయియ్తే దీనిపై మాత్రం పార్టీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న రోజా, భూమనల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది, స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది అనే విషయాలు మరి కొద్ది సేపటిలో తేలనున్నాయి.