వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డికి సీఎం జగన్ బంఫర్ ఆఫర్..!

Monday, August 19th, 2019, 09:25:08 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు.

అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలకు, తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డికి కూడా జగన్ ఓ ఆఫర్ ఇవ్వబోతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో జగన్ ఆయనకు కీలక పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో ఈయనకు మంచి పేరు ఉండడం అక్కడి సీటు ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆర్థర్ గెలుపుకు పనిచేసిన బైరెడ్డికి జగన్ ఇంతకు ముందే మంచి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. అయితే సీఎం జగన్ బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డికి క‌ర్నూలు జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంక్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ బైరెడ్డికి ఈ పదవిని ఇస్తారా లేక వేరే ఏదైనా పదవి కట్టబెడుతారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా తేలడంలేదు.