రైతులపై కురిసిన జగన్ వరాలజల్లు… పండగ చేసుకుంటున్న రైతులు

Tuesday, June 11th, 2019, 02:29:55 AM IST

ఏపీలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన జగన్ ప్రభుత్వం రైతులపై వరాల జల్లు కురిపించింది. మొదటి సారిగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతులకు ఉపయోగపడేలాగా కొన్ని కీలకమైన నిర్ణయాలని తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ సంవత్సరానికి 12500 రూపాయల సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం… దానికి తోడు రైతులందరికీ కూడా వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు… ఈ పథకాల కోసం వైఎస్సార్ పేరుతొ ఒక పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి పంటకు కూడా మద్దతు దార కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు…

అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని ఒక్కొక్కటిగా అమలు పరిచేందుకు సిద్ధమయ్యారు జగన్. రైతులందరికీ పగటి పూట 9 గంటల ఉచిత కరెంటు ఇవ్వనున్నారు. పంట భీమాకు ప్రీమియర్ ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు, పాడి ఉత్పత్తిని పెంచేందుకు సరైన చర్యలు, పశువుల బీమా. రైతులకు గరిష్ఠంగా 5 జీవాలకు బీమా కల్పిస్తారు. నాటు పశువులు, మేకలకు రూ.15వేలు, సంకరజాతి జంతువులకు రూ. 30వేల బీమా కల్పించనుంది. ఈ వరాలతో ఏపీలో ని రైతులందరూ కూడా పండగ చేసుకోనున్నారు…