కరోనా విషయంలో జగన్ ప్రభుత్వం అంచనా తప్పిందా..?

Monday, July 13th, 2020, 07:06:05 AM IST

ఏపీలో కరోనా మహమ్మారి ఎంటర్ అయ్యినప్పటి నుంచీ అందుకు సంబంధించిన సహాయక చర్యలు విషయంలో జగన్ మొదట తడబడినా ఆ తర్వాత మాత్రం అద్భుతంగా నిలదొక్కుకోగలుగారు అని చెప్పాలి.

ఇక ఆ తర్వాత నుంచి ఊహించని రీతిలో కరోనా టెస్టులు భారీ సంఖ్యలో చేస్తుండే సరికి ఒక్కో రోజుల్లోనే 70 కేసులు వస్తేనే ఒక్కొక్కరు భయపడిపోయారు. అలాగే ఆ మార్కు వంద దాటితే వామ్మో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా పరిస్థితులు మారిపోవడంతో రోజుకు మినిమం వెయ్యి కేసులు వచ్చేస్తున్నాయి.

అయితే కేసులు అధికంగా నమోదు అవుతున్న సమయంలో వైసీపీ అధికార ప్రతినిధులు మరియు కీలక నేతలు ఓ అంచనాను వివరించారు. ఎప్పుడైతే పరీక్షలు ఎక్కువ చేస్తే మొదట్లో ఎక్కువ పాజిటివ్ వచ్చినా మెల్లగా అవి తగ్గిపోతాయి అని అన్నారు. కానీ ఇప్పుడు తగ్గే సూచనలే ఎక్కడా కనిపించకపోగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి.

అంటే వారి అంచనా తప్పిపోయింది. అలాగే ఇందుకు ప్రధాన కారణం కూడా కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తున్నప్పటికీ దాన్ని వైకాపా ప్రభుత్వం కట్టడి చెయ్యలేకపోవడమే అని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నారు. దీన్ని బట్టి కరోనా విషయంలో జగన్ ప్రభుత్వం ఇంకా మెరుగైన మార్గాన్ని ఆలోచించి ఎన్నుకొంటే మంచిది.