రాజధాని నిర్ణయం రాష్ట్రాలదే.. హైకోర్ట్‌లో అఫిడవిట్ వేసిన జగన్ సర్కార్..!

Friday, August 14th, 2020, 08:29:03 AM IST

ఏపీ మూడు రాజధానుల అంశంపై కొనసాగుతున్న విచారణలో భాగంగా రాజధాని నిర్ణయాధికారం ఆయా రాష్ట్రాలదే అనే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని ఏపీ సర్కార్ హైకోర్ట్‌లో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా, రాష్ట్రానిదా అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేసింది.

అయితే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణలోకి రావని పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్టే భావించాలని, హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.