ఇంగ్లీష్ మీడియంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..!

Tuesday, March 24th, 2020, 02:00:09 AM IST

ఏపీ సీఎం జగన్ విద్యార్థులకు తీపికబురు అందించారు. అయితే పెరుగుతున్న సాంకేతికత, కాలానికి అనుగుణంగా విద్యలో మార్పు రావాలని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనను తేవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కారు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో తప్పకుండా ఇంగ్లీష్ మీడియం భోధనను అమలు చేయనున్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, అంతేకాక ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను ప్రభుత్వం కొనసాగించనుంది. కాగా ఉర్దూ వంటి పాఠశాలలు యధావిధిగా కొనసాగనుండగా ప్రతి స్కూల్‌లో తెలుగును కంపల్సరీ సబ్జెక్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.