హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళిన జగన్ సర్కార్..!

Friday, June 5th, 2020, 12:05:50 AM IST


ఏపీలో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ తోసిపుచ్చింది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలంటూ విడుదల చేసిన జీవోలను కూడా హైకోర్టు కొట్టివేసింది.

అయితే హైకోర్ట్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియాన్ని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.