లేటెస్ట్ న్యూస్ : కెసిఆర్ వేసిన ఉచ్చులో జగన్ ఇరుక్కుపోయారా…?

Thursday, June 13th, 2019, 03:28:33 AM IST

ఏపీకి కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా నిజాయితీగల వ్యక్తి మరియు ముక్కుసూటి వ్యక్తి… రాజకీయాల్లో కూడా అలాగే ఉంటున్నారు జగన్. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా. లాభనష్టాలు చూసుకోకుండా ముందుకు పోతున్నారు జగన్. కానీ రాజకీయాల్లో ఇలా ఇంతలా మంచితనంగా ఉంటె మున్ముందు చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలోని ఐదు కోట్ల మందికి అండగా ఉంది వారి బాగోగులు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వారి భవిష్యత్ అంత కూడా జగన్ చేతిలో ఉందన్న మాట వాస్తవం.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా తెలివైన రాజకీయ నేత. ఎన్నో కష్టాలను ఎదురుకొని మరీ చాలా మొండి తనంగా దూసుకుపోయి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకున్న దైర్యవంతుడైన నాయకుడు కెసిఆర్… అయితే తెలంగాణతో అసలుకే దోస్తీ వద్దనుకున్న నాయకుడు చంద్రబాబునాయుడు, కానీ తెలంగాణతో స్నేహమే ప్రాణం అంటున్న నేత జగన్మోహన్ రెడ్డి… కాగా కెసిఆర్ తో దోస్తీ వలన ఇప్పటివరకైతే ఏపీకి పెద్దగా ఒరిగిందేమి లేదు… ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించిన కెసిఆర్, తనంతోనే ప్రారం చేపించాలనుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు వలన ఏపీ కి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గోదావరి నీరు ఒడిసిపట్టి ఎగువ రాష్ట్రాలు లాగేసుకుంటే దిగువ, చివరి రాష్ట్రం ఏపీయే నష్టపోతోంది అనేది వారి వాదన. ఒకరకంగా చూసుకుంటే ఏపీకి తెలంగాణ వలన కూడా చాల సమస్యలు ముడిపడి ఉన్నాయన్న మాట పక్కన పెడితే, కెసిఆర్ మీద గౌరవం వలన జగన్ ఇలా మొహమాటానికి పొతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.