ఏరికోరి మరి ఆ అధికారిని ఏపీకి పిలిపించుకున్న జగన్.. కారణం అదేనా..!

Tuesday, July 9th, 2019, 05:53:11 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాలేదు. అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. అయితే తాజాగా జగన్ మరొక సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. అప్పట్లో తన తండ్రి బాగా మెచ్చుకున్న ఓ అధికారిని పట్టుబట్టి మరీ డిప్యూటేషన్‌పై ఏపీకి పిలిపించుకున్నాడు. ఇంతకీ ఆ అధికారి ఎవరు అనుకుంటున్నారు కదా. వై.ఎస్‌. రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ జేఈవో గా, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డి. అప్పట్లో ఈయన జేఈవోగా మంచి సేవలు అందించడం, ఈయనకు మంచి పేరు ఉండడంతో ఈయన సేవాను మరొకసారి వినియోగించుకుకోవాలనే ఉద్దేశ్యంతో జగన్ ఈయనను ఏపీకి పిలిపించుకున్నాడట. అయితే ప్రస్తుతం కేంద్రహోంశాఖలో కీలకమైన హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ హోదాలో ధర్మారెడ్డి పనిచేస్తున్న కేంద్రం సహాయంతో డిప్యూటేషన్‌పై ఏపీకి రప్పించబోతున్నారట. అయితే ఏవీ ధర్మారెడ్డి కి మల్ళీ టీటీడీలోనే అధికారాన్ని కట్టబెడతారా లేక మరేదైనా బాధ్యతలను అప్పచెబుతారా అనేది మాత్రం తెలియడంలేదు.