ఈ దెబ్బతో జగన్ పని అవుట్.. లేదంటే టీడీపీ ని ఫాలో అవ్వడమే..

Tuesday, September 10th, 2019, 09:27:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా తన దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తో సంచలనాలకి తేరా లేపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు. అయితే పోలవరం నిర్మాణ విషయం లో జగన్ సీరియస్ గా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే . చంద్రబాబు మాత్రం ఇవన్నీ కక్ష సాధింపులు అని పేర్కొన్నా , జగన్ మాత్రం ఎక్కడ తగ్గకుండా అవినీతిరహిత పాలనా కొరకు ప్రాకులాడుతున్నారు.

జగన్ పాలన పై కూడా హర్షధ్వనులు వినబడుతున్నాయి. కానీ కేంద్రం నుండి జగన్ కు భారీ షాక్ తగిలింది. పీఎంఓ రాసిన లేఖ పై జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. తన వైఖరితో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖా ఈ విషయాన్నీ సీరియస్ గా తీస్కొని రెండు రోజుల్లో స్పందించాల్సిందిగా కోరారు. రాజధాని విషయం లో కూడా ఇదే తీరు కనబరిచిన జగన్, ఇపుడు కేంద్రం మాట తీరుతో టీడీపీ పద్దతిని ఈ రెండు విషయాల్లో ఫాలో కావాల్సి ఉంటుంది. లేదంటే విపక్షాలు జగన్ తప్పుల కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ విషయం లో జగన్ నిర్ణయం చాల ముఖ్యం. ఎం నిర్ణయాన్ని తీసుకుంటారో వేచిచూడాల్సిందే.