ఇన్ సైడ్ టాక్ : టీడీపీ మీద జగన్ వేసిన ప్లాన్ మాములుగా లేదుగా..!

Thursday, July 11th, 2019, 09:55:10 AM IST

గడిచిన నలభై రోజుల పాలనలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ ఎన్నెన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకంటూ ప్రతీ రోజు వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు.ఒకపక్క ప్రజా పాలన చేస్తూనే మరోపక్క గత ప్రభుత్వంలో జరిచినటువంటి అవకతవకల పైన కూడా దృష్టి పెట్టి వాటి వివరాలను సేకరించేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేసారు.అలాగే తాను చెప్పినట్టుగానే గత ప్రభుత్వంలో టీడీపీ చేసినట్టుగా కాకుండా వందశాతం పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు టీడీపీపై జగన్ దిమ్మతిరిగిపోయే ప్లాన్ ఒకటి వేసినట్టు ఒక వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.గతంలో అనేక అంశాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వారు చేసిన తప్పులను అసెంబ్లీ ద్వారా వారి నోటితోనే చెప్పించే విధంగా జగన్ వ్యూహాలు వేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దీనిపైనే ప్రస్తుతం జగన్ చర్చలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.మరి జగన్ ఎప్పుడు దీన్ని అమలు లోకి తీసుకొస్తారో చూడాలి.