జగన్ దానికి ఒప్పుకుంటాడా..? మాట తప్పని నేతకు సవాళ్లు

Wednesday, October 9th, 2019, 05:09:35 PM IST

ప్రతిపక్షములో ఉన్నప్పుడు ఎలాంటి మాటలైనా మాట్లాడుతారు, కానీ అధికారపక్షములో ఉన్నప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి. రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి బాధ్యత అనేది తీసుకోవాలి, దానికి సమాధానం చెప్పాలి, ప్రతి పక్షములో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన జగన్, నేడు అధికారంలో వచ్చాక ఆ మాటలే తన మెడకి చుట్టుకుంటాయని ఉహించలేకపోయాడు

2018 జూన్ నెల సమయంలో బోటు ప్రమాదం జరిగితే అవి ప్రభుత్వ హత్యలేనంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ప్రభుత్వం చేతకానితనం వలనే ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై విచారణ చేసి ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలనీ, అదే సమయంలో చనిపోయిన వాళ్ళకి 25 లక్షల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అయితే ఇప్పుడు పాపికొండ విహారయాత్రలో సంభవించిన ప్రమాదంలో దాదాపు 50 మంది చనిపోయారు. నీళ్లలో మునిగిపోయిన బోటు బయటకు తీసుకొనిరాలేకపోయారు.

దాదాపు 13 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వాళ్ళ డెడ్ బాడీలు కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ప్రభుత్వ బోటులను పక్కన పెట్టి మరి ప్రవేట్ బోటులకు ఎలా అనుమతి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. 4 లక్షలు క్యూసెక్కుల నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే బోటుని పంపించాలి, కానీ 5 లక్షల క్యూసెక్కుల పైగా నీళ్లు ఉన్నప్పుడు ఎవరిని అడిగి పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా తేలలేదు. దీనిపై మంత్రుల కమిటీ వేశారని చెప్పారు , కానీ ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా దానిపై రాలేదు. మాట తప్పను మడమ తిప్పాను అని చెప్పుకునే జగన్ ఈ ఘటనపై మాత్రం గతంలో తాను చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనులకి మధ్య చాలా తేడా చూపిస్తున్నాడు