ఆ ఒక్క పనిచేస్తే జగన్ సత్తా ఏమిటో తెలుస్తుంది.

Sunday, June 16th, 2019, 08:46:21 PM IST

మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ పరిపాలనలో తన ముద్ర వేయాలని తెగ తాపత్రయ పడిపోతున్నాడు. అయితే అతని ఆలోచనలకు సరిపోయినంత డబ్బు అనేది లేదు. అసలే లోటు బడ్జెట్ రాష్ట్రం, దానికి తోడు లెక్కలేనన్ని అప్పులు ఉన్నాయి. వాటిని తట్టుకొని అభివృద్ధి పనులు ముందుకి తీసుకొనిపోవాలంటే అది తలకుమించిన భారం అవుతుంది. ఇప్పటికే పోలవరం నేను చేయను, అది కేంద్ర ప్రాజెక్టు అంటూ పోలవరం విషయంలో చేతులు దులుపుకున్నాడు.

కానీ విజయవాడలో నిర్మితమవుతున్న ప్లై ఓవర్ విషయంలో మాత్రం జగన్ తప్పించుకోవటానికి ఛాన్స్ లేదు. నిజానికి చంద్రబాబు హయాంలో ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెపుతూ దానిని చేపట్టారు. అయితే మధ్యలో చంద్రబాబు బీజేపీ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆపేసింది. దాదాపు 25 కోట్లు దాక నిధులు విడుదల కావలసి ఉంది. దీనితో పనులు నెమ్మదించాయి. ఎప్పుడు ప్లే ఓవర్ పూర్తీ అవుతుందో,దాని మీద పరుగులు తీద్దామని విజయవాడ వాసులు ఎదురుచూస్తున్నారు.

కాబట్టి దానిని త్వరగా పూర్తిచేయవల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, జగన్ నా వల్ల కాదని చేతులెత్తేసిన ఎవరు పట్టించుకోలేదు, కానీ విజయవాడ ప్లే ఓవర్ అలా కాదు. ఇప్పటికే చాలా భాగం పూర్తి అయ్యింది. ఇంకో పాతిక,ముప్పయ్ కోట్లు అయితే మిగిలిన పనులు కూడా పూర్తి అవుతాయి. వాటిని కేంద్రం నుండి రాబట్టుకోవటంకో,లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించటంతో చేసి దానిని త్వరగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొనివస్తే జగన్ మీద ప్రజాభిమానం ఇంకా పెరుగుతుందని చెప్పవచ్చు.