టీడీపీకి ప్రతిపక్ష హోదా నేను పెట్టిన బిక్ష..శివాలెత్తిన జగన్

Thursday, June 13th, 2019, 05:15:33 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో మొదలైన చిన్నపాటి గొడవ చినికి చినికి గాలి వానల మారిపోతుంది. అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుందని తెలుసు కానీ, మొదటి సమావేశాల్లోనే ఈ స్థాయిలో వాదోపవాదనలు నడుస్తాయని ఎవరు అనుకోలేదు. స్పీకర్ ఎన్నిక దగ్గర మొదలైన విషయం పార్టీ ఫిరాయింపులు దాక వెళ్ళింది. అధికార పక్షం మాటలకి ప్రతిపక్షం ఏ మాత్రం తగ్గకుండా సమాధానాలు ఇస్తూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది.

దీనితో జగన్ మాట్లాడుతూ నేను కూడా చంద్రబాబు గారి మాదిరి చేసివుంటే, వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చివుండేది కాదు. చంద్రబాబు అలా అక్కడ కూర్చొని ఉండేవాడు కాదు. నేను కూడా మీ మాదిరి ప్రలోభాలు పెట్టివుంటే, మీ లాగా మంత్రి పదవులు ఇస్తానని చెప్పి, నేను కానీ డోర్ తెరిస్తే ఎంత మంది రావటానికి సిద్ధంగా ఉన్నారో తెలుసా..? మాతో ఎంత మంది టచ్ లో ఉన్నారో నేను నోరు తెరిచి చెప్పటం లేదు, దానికి సంతోష పడండి అంటూ చెపుతూ, అసెంబ్లీ లో ప్రతిపక్షం ఉండాలని,ప్రతిపక్ష MLAలు ఉండాలని, ఆ సీటులో చంద్రబాబు ఉండాలని, మంచి సంప్రదాయాలు రావాలనే నేను కోరుకుంటున్న, ఇవేమి గమనించకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఘాటుగా విమర్శించాడు జగన్..