జగన్ బంఫర్ ఆఫర్: వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కీలక నేత..!

Wednesday, June 5th, 2019, 10:43:42 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే తనదైన పాలనను స్టార్ట్ చేశారు జగన్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ వీలైనంత త్వరగా తన మంత్రివర్గ కేబినెట్‌ను ప్రకటించే పనిలో ఉన్నారు.

అయితే తాజాగా వైసీపీలోకి కాపు ఉద్యమకారుడిగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి చేరితే జగన్ ఆయనకు బంఫర్ అఫర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. గత ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమాన్ని ఒక్కసారిగా బలోపేతం చేసి ముద్రగడ మంచి పాపులర్ నేతగా మారిపోయాడు. అయితే నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల టైంలో ముద్రగడ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని ఆ ఎన్నికల్లో ఆయన వైసీపీకి సహకరించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ రెండింటిలో మళ్ళీ టీడీపీనే అధికారం దక్కించుకోవడంతో ముద్రగడ ఎత్తులు సాగలేదని టీడీపీ శ్రేణులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికలకు ముందు ముద్రగడ వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగిన ఆయన ఆ సాహసం చేయలేదు. అయితే ముద్రగడ వైసీపీలో చేరితే జగన్ ఆయనకు కాకినాడ ఎంపీ సీటు లేదా ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు ఇస్తారని వార్తలు కూడా వినబడ్డాయి. అయితే తాజాగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నారని ఆయన చేరితే జగన్ కాపు కార్పొరేషన్ లాంటి కీలకమైన పదవి ముద్రగడకు అప్పచెప్పే యోచనలో ఉన్నారని అర్ధమవుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేల ముద్రగడ మాత్రం వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాకింగ్ వైసీపీకి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట.