సొంత నేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ – కారణం ఏమైఉంటుంది…?

Thursday, July 18th, 2019, 12:36:54 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్నా శాసనసభ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారాన్ని దక్కించుకున్న తరువాత జరుగుతున్న సమావేశాలు అవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పకుండ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ కొందరు మంత్రులు మాత్రం సరిగ్గా హాజరవడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఈసమావేశాలకు ముందే జగన్ వీటికోసమని ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మరీ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, అందుకు సంబంధించి డేటా ఎక్కడ నుండి తీసుకోవాలనే దాని పై క్లాసులు కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పటికి కూడా కొందరు నేతలు జగన్ మాటని పెడచెవిన పెట్టారని, అందుకనే జగన్ సీరియస్ అయ్యారని సమాచారం.

ఈమేరకు సమావేశానికి ‘రాని మంత్రులెవరెవరు ? జాబితా సిద్ధం చేయండి. వారి పరిస్థితేంటో మాట్లాడదాం’ అని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరుల్ని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో ప్రభుత్వ వాదనని గట్టిగ చెప్పడంతో పాటు టీడీపీ ని అన్ని విషయాల్లో ఎండగట్టాలని ఇప్పటికే కొన్ని ప్రణాళికలు కూడా వేసుకున్నారు. కానీ ఈ ప్రణాళికలు ఎవరికోసమైతే సృష్టించారో వారే సభకు గైర్హాజరవడం అనేది జగన్ కి కోపం తెప్పిస్తుందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నా సమయంలో మంత్రులు రాకపోవటం బాధ్యతరహితం అవుతుందని జగన్ వారి బాగా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈమేరకు జగన్ వారిని ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి మరి… ఎందుకంటే చాలా ఏళ్ళ నిరీక్షణ తరువాత అధికారం కాబట్టి ఎక్కడ కూడా చిన్న తప్పిదం జరగకుండా జగన్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు.