హామీల అమల కోసం జగన్ అదిరిపోయే ప్లాన్

Tuesday, August 13th, 2019, 04:49:47 PM IST

ఎన్నికల హామీ సమయంలో జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాలు ప్రకటించాడు. వాటిని నెరవేర్చిన తర్వాతే మళ్ళీ 2024 లో ఓట్లు అడుగుతానంటూ మాట ఇచ్చాడు. ఇక సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల మీద ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా మొదట గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏర్పడిన తర్వాత తమ పధకాలు నేరుగా ప్రజలకి వెళ్లేలా చేయటానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు.

ఈ నెల 15 నుండి గ్రామ వాలంటీర్ వ్యవస్థని జగన్ ప్రారభించబోతున్నాడు. ప్రతి నెల 1 నుండి 10 తేదీలోపు పెన్షన్ ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ అందిస్తారు. ఆ తర్వాత 10 నుండి 15 దాక రేషన్, కొత్త పెన్షన్ విషయాలు చూసుకుంటారు. 15 నుండి 30 దాక ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు.అలాగే ప్రతి ఇంటికి తిరిగి ఇళ్ల పట్టాలు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించి వాటికీ తగ్గట్లు పనులు చేపడుతారు. ఇలా ప్రతి పనికి కూడా పక్క ప్లాన్ తో జగన్ ముందు పోనున్నాడు. తాను ఇచ్చిన నవ రత్నాలు హామీని నెరవేర్చేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు జగన్ దూసుకొనిపోతున్నాడు.