అప్పుడే చంద్రబాబుకి జగన్ “రిటర్న్ గిఫ్ట్”..ఇక జగన్ను ఆపలేరు.!

Monday, June 3rd, 2019, 05:56:28 PM IST

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అస్సలు గ్యాప్ ఇవ్వకుండా తన పనులు చేస్తూనే ఒక్కొక్కరి చేత పరుగులు పెట్టిస్తున్నారు.ఇదిలా ఉండగా ఇప్పుడు మాత్రం జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబుకు ఊహించని రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారట.దీని ప్రభావం చంద్రబాబు పై ఓ రేంజ్ లో ఉండబోతుంది అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విజయవాడ అమరావతి సమీపంలో లింగమనేని ఎస్టేట్స్ వారి నుంచి ఒక వసతి గృహాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ ఇంటి కోసం చంద్రబాబు చేసిన పనికి జగన్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.ఆ ఇంటికి సంబంధించి చంద్రబాబు అక్కడ ఉండే వారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఆ ఇల్లు కట్టడానికి మాత్రం చంద్రబాబు తన స్వంత డబ్బులు ఖర్చు పెట్టకుండా మొత్తం అంతా ప్రభుత్వ ఖాజానా నుంచి ఖర్చు పెట్టారట.

బాబు అవసరాల కోసం ప్రభుత్వ ఖాజానాను ఖాళీ చెయ్యడం పట్ల జగన్ చంద్రబాబు పై ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారని అసలు ప్రభుత్వ సొమ్మును తన విలాసాల కోసం వినియోగించడం ఏమిటని కొంత మంది ప్రశ్నలు వేస్తున్నారు.దీనితో చంద్రబాబుపై జగన్ ఎలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది కీలకంగా మారనుంది అని విశేల్షకులు చర్చించుకుంటున్నారు.