జగన్ రాస్తున్న కొత్త చరిత్ర… మూగబోయిన టీడీపీ

Monday, October 14th, 2019, 10:58:35 AM IST

మూసధోరణిలో ఇన్నేళ్లు రాజకీయం అలా గడిచిపోయింది. జగన్ ప్రభుత్వం అధివారంలోకి వచ్చాక పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రతి పక్ష పార్టీలు ఎంతగా విమర్శించినప్పటికీ జగన్ తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. పాలనలో పారదర్శకత, అవినీతిరహిత్య సేవలు అన్నిట్లో తన మార్క్ పాలనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ అందిస్తున్న సేవలు చరిత్రలో నిలుస్తున్నాయి.

దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలను ప్రవేశపెట్టి యువతకి చేయూతనిచ్చారు జగన్. వైద్య రంగంలో చేస్తున్న మార్పులకు ప్రజలు జగన్ కు జేజేలు పలుకుతున్నారు. ఇపుడు వైయస్సార్ రైతుబంధం పేరుతో రు. 5510 కోట్ల రూపాయల్ని జగన్ విడుదల చేసారు. దాదాపు 50 లక్షల రైతు కుటుంబాలకు రు. 12,500 లు అందజేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. జగన్ పై విమర్శలు గుప్పించడం సహజమే, మెరుగైన పాలన కాదు అని చాల మంది ప్రతిపక్ష పార్టీ నేతలు అన్నారు. కానీ ఇపుడు రైతులకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను చూస్తుంటే టీడీపీ కి నిజంగానే నోరు రావడం లేదు.