టెక్షాస్ ప్రతినిధులతో సీఎం జగన్ రౌండ్ టేబుల్ సమావేశం..!

Monday, August 19th, 2019, 10:41:21 PM IST

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి హొదాలో మొట్టమొదటి సారిగా అమెరికా వెళ్ళిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారనే చెప్పాలి. అయితే నిన్న జగన్ ప్రసంగం ఉండడంతో డల్లాస్‌లో హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ తెలుగువారితో కిక్కిరిసిపోయిందంటేనే జగన్‌కి అక్కడ కూడా ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్ధమయ్యింది. అయితే సీఎం జగన్ నేడు అక్కడి టెక్షాస్ రాష్ట్రంలోని కొందరు అధికారులతో 20 నిమిషాల పాటు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అయితే టెక్షాస్ మరియి ఏపీ రాష్ట్రాల మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవాలని జగన్ ఈ సమావేశంలో చెప్పారు.

అంతేకాదు ఏపీకి కావలసిన అభివృద్ధి మరియు మరికొన్ని అంశాలను కూడా వారితో చర్చించారు. అయితే ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించి ఏపీనీ సందర్శించాలని అక్కడి ప్రతినిధులను కోరారు. అంతేకాకుండా చమురు మరియు గ్యాస్, వ్యవసాయ పరిశ్రమలు, లాజిస్టిక్స్ కంపెనీలు, ఐటి సంబంధిత మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థల ప్రత్యేక పరిశ్రమల నుండి ప్రత్యేకంగా సీఈవోలతో కూడా జగన్ సంప్రదించి వారిని కూడా ఏపీని సందర్శించాలని కోరారు.