ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పిన జగన్ – మాట నిలుపుకునేనా…?

Wednesday, June 5th, 2019, 02:21:19 AM IST

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత జగన్ తన పనులను చక చకా చేస్తూ వెళ్తున్నాడు… రాష్ట్రానికి చక్కటి పాలనను అందించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నాడు… ఇప్పటికే టీడీపీ హయాంలో ఉన్నటువంటి పథకాల పేర్లను మార్చేశారు జగన్. అన్ని పథకాలకు తన తండ్రి పేరు పెట్టుకుంటున్నాడు. సంబంధిత శాఖలకు జగన్ పేర్లు మార్చే పనిలో ఉన్నారని సమాచారం. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సహా పలు పథకాలకు ఉన్న ఎన్టీఆర్ పేరు స్థానంలో తన తండ్రి, ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు జగన్. అయితే ఎన్టీఆర్‌ అంటే తమకు కూడా గౌరవం అని అసెంబ్లీలో చెప్పిన ప్రస్తావించిన జగన్, ఎన్టీఆర్ పేర్లతో ఉన్న పథకాలను మార్చడంపై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి… అంతేకాకుండా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే జగన్ గతంలో కృష్ణ జిల్లాలో జరిపిన పాదయాత్ర సందర్భంగా కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారని మాటిచ్చారు. కానీ ఇప్పుడేమో ఎన్టీఆర్ పేర్లతో ఉన్న పథకాలను మార్హ్స్స్తున్నారు. కాగా కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా త్వరలోనే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారో లేదో అని అందరు ఎదురు చూస్తున్నారు. చివరగా టీడీపీ ప్రభుత్వ హయాంలోని పథకాలకు ఎన్టీఆర్ పేరును తొలగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా లేదో చూడాలి…