మహిళలకు బాబు హ్యాండిచ్చారు.

Friday, September 26th, 2014, 12:53:22 AM IST

jagan
ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశ్యంతో మహిళలు గత మూడు నాలుగు నెలలుగా వాయిదాలు చెల్లించలేదని..కాని, ఇప్పుడు వారికి వడ్డీల భారం పెరిగిపోతున్నదని ఆయన అన్నారు. ఇప్పటివరకు కట్టినవన్నీ వడ్డీకే సరిపోతున్నదని బ్యాంకులు చెబుతున్నాయని డ్వాక్రా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ కాకపోవడం అలా ఉంచితే.. ఇప్పుడు బోగస్ కార్డులు ఉన్నాయని చెప్పి 17 లక్షల కార్డులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇక రేషన్ కార్డులు కావాలంటే గగనం అయిపోతుందని ఆయన మండిపడ్డారు. వృద్దులు, వితంతువులకు పించనలు ఇస్తారో.. ఇవ్వరో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఉన్న 43 లక్షల మందికి నెలనెలా 1000 రూపాయల చొప్పున పించను ఇవ్వాలంటే.. నెలకు 430 కోట్ల రూపాయలు కావాలని, సంవత్సరానికి 3600 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.. కాని, ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నదని జగన్ తెలుగుదేశం ప్రభుత్వం పై మండిపడ్డారు.