వారికోసం మాత్రమే జగన్ ప్రత్యేకమైన సంచలన ట్వీట్..!

Thursday, June 6th, 2019, 11:16:52 AM IST

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.అయితే జగన్ ఇంతటి పెద్ద విజయాన్ని అందుకోవడానికి వైసీపీ కోసం చాలా మందే కష్టపడ్డారు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.ఇక ఎలాగో జగన్ ఇంతటి విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రిగా తన సీలను రాష్ట్రానికి అందించే పనిలో నిమగ్నమై ఉంటూనే తనకి ఇంత గొప్ప విజయం అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు.అయితే ఈ రోజుల్లో క్షేత్ర స్థాయితో పాటుగా సోషల్ మీడియా లో కూడా పార్టీల పరంగా ప్రచారాలు విమర్శలు ప్రతివిమర్శలు చాలానే నడిచాయి.అలాగే ప్రతీ పార్టీకి సోషల్ మీడియా విభాగం ఉన్నట్టుగానే జగన్ కు కూడా ఉంది.

జగన్ ను అనుక్షణం అనుసరించే వారు.ఇతర పార్టీల వారు పెట్టే విమర్శల పోస్టులకు తమ పోస్టుల ద్వారా తిప్పి కొట్టేవారు.ఇప్పుడు అలా సోషల్ మీడియాలో కూడా తనకోసం కస్టపడి పని చేసిన వారందరి కోసం జగన్ ఒక సంచలన ట్వీట్ పెట్టారు.”తాను భాద్యతలు చేపట్టేందుకు అనుక్షణం పోరాటం చేసిన సోషల్ మీడియా వీరులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాని తన విజయం కోసం పచ్చ మీడియాపై వారు ఎంతలా పార్టీ కోసం కష్టపడ్డారో తనకి తెలుసనీ వారందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతున్నా” అని జగన్ ఒక సంచలన ట్వీట్ పెట్టి వైసీపీ శ్రేణుల కళ్ళల్లో ఆనందం నింపారు.