నా ప్రయత్నానికి ఎవరు అడ్డు రాకండి – ఏపీ సీఎం

Wednesday, July 17th, 2019, 12:23:51 AM IST

ఏపీలో కొత్తగా అధికారాన్ని సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాలనలో దూసుకెళ్తున్నారు. అధికారాన్ని చేపట్టిన మొదటి రోజే రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చి దిద్దటమే తన లక్ష్యం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఈ అంశం క్షేత్రస్థాయికి బలంగా వెళ్లాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కాకపోతే ఈ విషయాన్నీ క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుందా అని పలువురు అధికారులు జగన్ ని అడగగా, అపుడు జగన్ “స్పందన” కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి… ఎక్కడా అవినీతి ఉండకూడదని పదేపదే చెబుతున్నానని, తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ఎక్కడా ఆ పరిస్థితి లేదని భావించమంటారా అని జగన్ ప్రశ్నించారు.

అంతేకాకుండా రాష్ట్రంలో పేరుకుపోయిన ఈ అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించాలని అధికారులకు మరోసారి సీఎం ఆదేశించారు. ఇకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా స్థాయిలో నేను ప్రయత్నిస్తున్నాను. అధికారులు, కలెక్టర్లు అందరు కూడా తమ తమ స్థాయిలో గట్టిగ ప్రయత్నించాలని జగన్ ఆయాదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తన ప్రయత్నానికి ఎవరు కూడా అడ్డు పడకూడదని గట్టిగ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా తిరిగి వెళ్లామనే భావన వారికి ఉండాలన్నారు. ఇకపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా స్పందన కార్యక్రమాన్ని సమీక్షిస్తారని చెప్పారు. ఈమేరకు అన్ని జిల్లాలో, అన్ని ప్రాంతాల్లో సమీక్షలు నిర్వహించడానికి జగన్ ప్రళికాలు వేశారు.