ఇంత పెద్ద నింద పడినా జగన్ నోరు మెదపరేమిటి ?

Sunday, September 22nd, 2019, 11:08:49 AM IST

గ్రామ సచివాలయం నియామక ప్రవేశ పరీక్షల్లో భారీగా కుట్రలు జరిగాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ప్రశ్నా పత్రాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లీక్ అయ్యాయని, తద్వారా ఉద్యోగుల బంధువులకు, సన్నిహితులకు మాత్రమే ర్యాంకులు వచ్చాయని, ఒక్కో ఉద్యోగి ఇంట్లో ముగ్గురికి ర్యాంకులు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చిందని ఆరోపించారు చంద్రబాబు.

జనసేన సైతం పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. వెంటనే సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో అవకతవకలు జరగలేదని సంబంధిత అధికారులు, నేతలు చెబుతున్నారు తప్ప జగన్ మాత్రం స్పందించడంలేదు. వెంటనే ఆయన కూడా కమిటీ వేయడం లాంటివి చేసి, విచరాణ చేపట్టి పడిన నిందను తొలగించుకునే ప్రయత్నం చేయడం మంచిది.