బిగ్ బ్రేకింగ్ : ఈ లెక్కన జగన్ రాజీనామా..సాక్ష్యంతో సహా?

Sunday, September 22nd, 2019, 11:31:18 AM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి వై ఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన పాలన అందిస్తారు అని అనుకుంటే అది కాస్తా ఇప్పుడు రివర్స్ అయ్యేలా కనిపిస్తుందని గట్టి టాక్ వినిపిస్తుంది.అంతే కాకుండా జగన్ నిర్ణయాలు అన్ని పారదర్శకంగా తీసుకుంటానని చెప్పి కేవలం తమకి మాత్రమే తమ పార్టీ వారికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

మొన్న జరిగిన గ్రామ వాలంటీర్ల నియామకాలు అయితేనేం ఇప్పుడు తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు అయితేనేం అవన్నీ వైసీపీ కను సన్నల్లోనే జరిగాయని వార్తలు వస్తున్నాయి.ప్రశ్నా పత్రం ముందే లీకయ్యిందని అందులోను వైసీపీ మరియు జగన్ సామాజికవర్గానికి చెందిన వారికే అత్యధిక మార్కులు రావడం అంతా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని సామాన్య ప్రజలు అంటున్నారు.అయితే దీనికి సంబంధించి జగన్ తన ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు రాజీనామా చేస్తారా అని సరికొత్త ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

గ్రామ సచివాలయ పోస్టులకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు లీకేజ్ వల్లనే అదే పేపర్ ను ప్రిపేర్ చేసిన అమ్మాయి సహా వారి ఇంటి సభ్యులకే ఉద్యోగాలు వచ్చాయని వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.అయితే గతంలో తెలుగుదేశం పార్టీ పదవతరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేసారని అలా చేసినట్టయితే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై గద్దించారు.కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అలాంటి పరిస్థితే జగన్ కు కూడా వచ్చింది.దీనితో గతంలో అసెంబ్లీలోని జగన్ చెప్పిన మాటలనే తీసుకొచ్చి జగన్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారని సోషల్ మీడియా ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు.