ఇన్సైడ్ న్యూస్ : బాబు విషయంలో జగన్ ఇలా చేసి తీరాల్సిందేనా.?

Wednesday, February 26th, 2020, 06:59:41 AM IST

గత కొన్ని రోజులు నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ కీలక నేతలను అధికార వైసీపీ టార్గెట్ చెయ్యడం సుస్పష్టంగా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు కు అత్యంత సన్నిహితులు దగ్గర దాదాపు 2 వేల కోట్ల నల్ల ధనంకు సంబంధించి ఆస్తులు దొరికాయని అలాగే ఆ తర్వాత వారి ఏమీ దొరకాలేదనీ వార్తలు బయటకు వచ్చాయి.ఇదిలా ఉండగా మరొక పక్క చంద్రబాబు గతంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచేసుకున్నాడని ఓ వైసీపీ నేత అయితే ఏకంగా 7 లక్షల కోట్లు అది అని బాంబు కూడా పేల్చారు.

ఇలా వైసీపీ నేతలు అంతా చంద్రబాబు అవినీతి పై పుంకానుపుంకాలుగా సంచలనం రేపే స్టేట్మెంట్లు ఇస్తున్నారు.దీనితో సామాన్య జనం బాగా విసుగెత్తి పోయినట్టు టాక్ వినిపిస్తుంది. వీళ్ళు ఎంతసేపూ బాబు అవినీతి పై ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకునే సూచనలు అయితే ఇవ్వడం లేదు. దానికి తోడు చంద్రబాబు కూడా బాహాటంగానే గతంలో నీ తండ్రి నాపై 23 కమిటీలు వేయించాడు నువ్వెంత అన్నట్టు జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు.ఇంక ఇలాంటి సమయంలో కూడా జగన్ అండ్ కో చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజం అని నిరూపించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది అని చెప్పాలి.