జాబు రావాలంటే బాబు పోవాలి! -జ‌గ‌న్‌

Friday, January 27th, 2017, 12:26:00 AM IST

jagan
బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని ప్రామిస్ చేశారు తేదేపావోళ్లు. హామీలిచ్చారు. కానీ జాబు రాలేదు.. అని విమ‌ర్శించారు వైకాపా అధినేత వైయ‌స్‌ జ‌గ‌న్‌. జాబు రావాలంటే బాబు పోవాలి.. అని నేను చెబుతున్నా. ఇంకో రెండేళ్ల‌లో మేం వ‌స్తాం. అప్పుడు ఉద్యోగాల స‌మ‌స్య లేకుండా చేస్తామ‌ని అన్నారు.

ప్ర‌స్తుతం సాగిస్తున్న మౌన‌పోరాటానికి బాస‌ట‌గా రేపు ప్ర‌జ‌లంతా ఉద్య‌మ‌స్ఫూర్తిని ర‌గిలిస్తూ పోరాటంలో పాల్గొనాల‌ని అన్నారు. జల్లిక‌ట్టు స్ఫూర్తి ర‌గిలించింది. దాంతో పోలికేంటి అని అడుగుతున్నారు. దానికి నేను స‌మాధానం చెప్ప‌ను కానీ, ఆ స్ఫూర్తి, ఐక్య‌త‌తో ముందుకు సాగాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నా.. అనీ జ‌గ‌న్ అన్నారు.