జగన్ స్ట్రాటజీ దెబ్బకు జనసేన,బీజేపీ విలవిల.?

Wednesday, February 26th, 2020, 01:24:50 PM IST

ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు సరికొత్త మారిపోతూనే ఉన్నాయి.ముఖ్యంగా గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల అనంతరం మరింత రంజుగా మారాయని చెప్పాలి.ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అన్నీ కూడా తమ లోటు పాట్లను సరిదిద్దుకొనే క్రమంలోనే ఉన్నారు.ముఖ్యంగా వైసీపీ పార్టీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉండడం అలాగే దానికి మరియు బీజేపీ పార్టీకు ముడిపడి ఉండడం మూలాన ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ మరియు జనసేన పార్టీలకు కాస్త ఇబ్బందికర వాతావరణం మొదలయ్యింది.రాష్ట్రంలో మాత్రం జనసేన పార్టీపై వైసీపీ విమర్శలు చేసినా బీజేపీపై చేసింది లేదు.

కానీ ఇక్కడ బీజేపీ మాత్రం వైసీపీను ఒక లెక్కలో ఏకేస్తారు.వీటన్నిటిని బ్యాలన్స్ చేస్తూ జగన్ కేంద్ర పరిధిలోనే బీజేపీ తీసుకునే నిర్ణయాలను స్వాగతించడం అలాగే నరేంద్ర మోడీని కలుస్తుండడంతో అక్కడ నుంచి మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ ను అందుకుంటున్నారు.జగన్ తీసుకున్న స్ట్రాటజీ వలనే రాష్ట్ర స్థాయిలో జనసేన మరియు బీజేపీ పార్టీలలో గందరగోళ వాతావరణం నెలకొంది.జగన్ ను ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమందమన్నా అక్కడ కేంద్రంలో అతనిపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది.అలా అని విమర్శించకుండాను ఉండలేరు.దీనితో ఇపుడు జనసేన మరియు బీజేపీ పార్టీలు కాస్త డైలమాలో పడ్డారని రాజకీయ వర్గాల్లో టాక్..