శాత‌క‌ర్ణి యాత్ర‌కు జ‌గ‌న్ స‌పోర్ట్‌?

Thursday, November 10th, 2016, 04:59:00 PM IST

shathakarni-car
శాత‌క‌ర్ణికి .. వైయ‌స్ జ‌గ‌న్‌కి లింకేంటి? అని అడ‌గొద్దు. జ‌గ‌న్ అంటే వైయ‌స్ జ‌గ‌న్ కాదు లెండి. ఎన్‌బికె హెల్పింగ్ హ్యాండ్ జ‌గ‌న్ గురించి ఇదంతా. ఆయ‌న సార‌థ్యంలోనే బాలకృష్ణ 100వ మూవీ `గౌతమిపుత్ర శాతక‌ర్ణి` యాత్ర మొద‌లైంది. చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉండ‌గానే ఫ్యాన్స్‌లో హ‌డావుడి మొద‌లైంది. శాత‌క‌ర్ణి డిజైన్‌ల‌తో తీర్చిదిద్దిన 3 ప్ర‌త్యేక వాహ‌నాల్ని బ‌రిలో దించారు. నిన్న‌నే బాల‌య్య (జూబ్లీహిల్స్‌) ఇంటినుంచి ఈ శ‌క‌టాలు బ‌య‌ల్దేరాయి. 100 పుణ్య‌క్షేత్రాల్లో ఈ యాత్ర సాగుతుంది. ఈ పుణ్యక్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చన, 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు చేయ‌నున్నారు. ఫ్యాన్స్ చేప‌ట్టిన ఈ బృహ‌త్త‌ర ప్ర‌మోష‌న్ యాత్ర‌కు నిర్మాత‌లు త‌మ వంతు సాయం చేయ‌నున్నారు.

అన్న‌ట్టు నంద‌మూరి బాల‌కృష్ణ అంటే వైయ‌స్ జ‌గ‌న్ ప‌డి చ‌స్తారు. ఆయ‌న‌కు వీరాభిమాని. ప్ర‌త్యేకించి సినిమా డెస్కును, జ‌ర్నలిస్టుల్ని పిలిచించుకుని బాల‌య్య‌పై స్పెష‌ల్ స్టోరీలు రాయిస్తారు సాక్షిలో. మ‌రి అంత‌టి వీరాభిమాని స‌పోర్టు ఈ యాత్ర‌కు ఉంటే సంథింగ్ స్పెష‌ల్‌గా ఉండేది మ‌రి!!