పొలిటికల్ బ్రేకింగ్ : జగన్ మరో సంచలనాత్మక నిర్ణయం..!

Friday, June 14th, 2019, 01:52:29 PM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.జగన్ తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఇతర పార్టీల శ్రేణులకు చెమటలు పడుతుండగా రాష్ట్ర ప్రజలు మాత్రం ఆనందంలో మునుగుతున్నారు.కాకపోతే జగన్ ఇస్తున్నటువంటి హామీలకు గాను ఎక్కడ నుంచి డబ్బులు తీసుకు వస్తారని మరోపక్క కూడా విమర్శలు వస్తున్నాయి.అయినా సరే జగన్ వాటికి పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతున్నారు.తాను మొదటి నుంచి చెప్తున్నా మాట ప్రకారమే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసమే కొన్ని సంచలన మరియు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు కూడా అలానే రాష్ట్రం కోసం ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది.మాములుగా ఎర్ర చందనంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలుసు.అందుకే వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అలా చేస్తూ ఎంతో మంది పోలీసులకు పట్టుబడిన వార్తలు కూడా ఎన్నో మనం న్యూస్ ఛానెళ్లలో చూసే ఉంటాము.

ముఖ్యంగా ఇవి తిరుపతి శేషాచలం అడవుల ప్రాంతంలోనే అత్యధికంగా దొరుకుతాయి.అందువల్ల అక్కడ నుంచే వీటిని దుండగులు నరికి అక్రమంగా తరలిస్తారు.ఆ ఆసమయంలో పట్టుకున్న పోలీసులు చేతికి ఇప్పటికే ఎన్నో టన్నుల దుంగలు ప్రభుత్వ ఆధీనంలోనే గోడౌన్ లో ఉన్నాయట.వీటన్నిటిని వీటికున్న డిమాండ్ నిమిత్తం అమ్మినట్టయితే ఆ వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించొచ్చని జగన్ అనుకుంటున్నారట.మరి జగన్ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో చూడాలి.