బ్రేకింగ్ న్యూస్ : మంత్రివర్గ ఏర్పాటుపై జగన్‌ సంచలన నిర్ణయం!

Friday, June 7th, 2019, 12:19:05 PM IST

వైసీపీ అధినేతే జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కీలక నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగానే ఈ రోజు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సమావేశంలో కూడా జగన్ తన క్యాబినెట్ లో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు అన్నది ప్రకటించనున్నారు అని తెలియడంతో ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు సహా వైసీపీ శ్రేణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదే సందర్భంలో జగన్ తన మంత్రి వర్గ ఏర్పాటుపై ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్టు ఇపుడు వార్త బయటకు వచ్చింది.ఈసారి జగన్ ఏకంగా ఐదు మందిని డిప్యూటీ సీఎం లుగా చెయ్యాలని ఖరారు చేసుకున్నారట.అంతే కాకుండా వారిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మరియు కాపులకు కూడా అవకాశం కల్పించనున్నారు అని తెలుస్తుంది.మరి జగన్ ముందు ముందు ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.