బ్రేకింగ్: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. జగన్ సంచలన నిర్ణయం..!

Sunday, June 16th, 2019, 06:17:07 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. వీటన్నిటిని చూసుకుంటూనే గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడంపై కూడా దృష్టి సారించారు.

అయితే ఎన్నికల ముందు జగన్ బాబాయ్ వివేకా హత్య రాజకీయాలలో సంచలనం రేపింది. అది వైసీపీనే చేయించిందంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. అయితే వివేక హత్యకు గురై చాలా రోజులు అవుతున్న పోలీసులు ఇప్పటికి ఆ హత్య కేసును చేధించలేకపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పచెప్పింది. అయినా కూడా ఈ కేసు ఒక కొల్లిక్కి తీసుకురాలేకపోయారు. అయితే తాజాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. అయితే జగన్ ఈ కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అందరిలోనూ ఆసక్తి కనబడింది. అయితే తాజాగా ఈ కేసులో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన 25 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ప్రత్యేక బృందం కడప ఎస్పీ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు పనిచేస్తారు. ఈ ప్రత్యేక బృంద ఏర్పాటుకై ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ ప్రత్యేక బృందం అయిన వివేకా హత్య కేసును చేధిస్తుందో లేదో వేచి చూడాలి.