ఇట్స్ ఫైనల్ : రోజాకు కీలక పదవి అప్పగించిన జగన్!

Wednesday, June 12th, 2019, 03:00:13 PM IST

ఎట్టకేలకు నగరి వైసీపీ ఎమ్మెల్యేకు ఆ పార్టీ అధినేత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్న వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.గత కొన్ని రోజులు నుంచి జగన్ క్యాబినెట్ లో రోజాకు చోటు దక్కకపోవడం వల్ల ఆ పార్టీలో కొంత మంది సహా రోజా అనుచర వర్గం తీవ్ర నిరాశకు లోనయ్యారు.అందులో భాగంగా తనపై అసత్య ప్రచారం జరుగుతుందని నిన్ననే రోజా ఆరోపించారు.రోజా బయటకు అలా చెప్పినా సరే ఆవిడలో కూడా ఎక్కడో చిన్న కలత ఉన్న సంగతి తెలిసిందే.

ఇదే విషయాన్ని మరియు గత తొమ్మిదేళ్ల నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమ ఓడ్చిన రోజాకు ఏదన్నా చెయ్యాలి అని భావించి జగన్ ఒక కీలక పదవి అప్పగించారట.ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి గెలిచిన రోజాకు కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి దక్కలేదు కానీ జగన్ “ఏపీఐఐసీ”(ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక శాఖ)కు ఛైర్మెన్ గా నియమించినట్టు తెలుస్తుంది.మొత్తానికి రోజాకు జగన్ ఈ విధంగా అయినా సరే రోజాకు కాస్త ఊరట కలిగించారనే చెప్పాలి.ఇక రాబోయే రెండున్నర ఏళ్ల తర్వాత అయినా రోజాకు మంత్రి పదవి అప్పగిస్తారో లేదో చూడాలి.