బ్రేకింగ్ న్యూస్ : అసెంబ్లీలో మరో సారి “వై ఎస్ జగన్ అనే నేను”

Wednesday, June 12th, 2019, 12:36:40 PM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా “వై ఎస్ జగన్ అనే నేను” అనే పిలుపు కోసం యావత్తు వై ఎస్ అభిమానులు సహా జగన్ అభిమానులు మొత్తం తొమ్మిదేళ్ల పాటు నిరీక్షించారు.వారందరి ఆశీస్సుల ఫలితంగా మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి కావడంతోనే ఘనమైన విజయాన్ని సొంతం చేసుకొని మే 30 వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి వైసీపీ శ్రేణుల కళ్ళల్లో ఆనందం నింపారు.ఇదే ఊపులో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే జగన్ ఒక సరికొత్త ఒరవడిని తీసుకొచ్చి మంచి సీఎంగా ఇప్పటి నుంచే అందరి మన్ననలు అందుకుంటున్నారు.

అలాగే ఈ రోజు మరలా ఎంతో అట్టహాసంగ మొదలయిన శాసన సభా సమావేశాలలో కూడా మరో మారు “వై ఎస్ జగన్ అనే నేను” మాట వినిపించడంతో అందులోను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చెయ్యడంతో వైసీపీ అభిమానుల కళ్ళల్లో మరోసారి ఆనందం నింపిన వారు అయ్యారు.ముఖ్యమంత్రిగా ప్రొటెం స్పీకర్ అయినటువంటి సంబంగి చిన అప్పలనాయుడు నేతృత్వంలో మొదటి వ్యక్తిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు.ఆ తర్వాత ఇతర పార్టీల శ్రేణులు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసారు.