బిగ్ బ్రేకింగ్ : మొత్తం మంత్రి వర్గం విషయంపై జగన్ సంచలన నిర్ణయం..?

Thursday, June 6th, 2019, 12:21:43 PM IST

వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు వారి పార్టీ శ్రేణులకు కూడా ఊహించని విధంగా ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇప్పుడు బయటకు వస్తుంది.ఇంకా మరికొద్ది రోజుల్లోనే జగన్ మంత్రి వర్గ సమావేశం మొదలవ్వనుంది అనగా ఇంకా ఆ సమావేశంలో పాల్గొనే మంత్రులు ఎవరు అన్నది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ జిల్లాల వారీగా మాత్రం చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి.

జగన్ ఈసారి మాత్రం తన క్యాబినెట్ లో మంత్రులుగా ఎవరిని నియమించారు అన్నది వైసీపీ శ్రేణులు మరియు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి కూడా తెలిసేలా కూడా చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదట.అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాత్రం జగన్ తన మంత్రి వర్గం పై ఇప్పటికే ఒక సంచలన నిర్ణయం తీసేసుకున్నారట.ఒక్కొక్కరిగా కాకుండా జగన్ ఈసారి మొత్తం మంత్రి వర్గాన్ని ఒకేసారి నియమించే యోచనలో ఉన్నారని అలాగే అన్ని వర్గాల వారికి కులాల వారికి జగన్ సమ న్యాయం చేస్తారని కూడా తెలుస్తుంది.అరకొరగా ఒకటి రెండు స్థానాలను అందాకా హోల్డ్ లో పెట్టినా మిగతా స్థానాల్లో భర్తీ చేస్తారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ వార్త ఊపందుకుంది.మరి జగన్ అధికారక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.