బ్రేకింగ్ న్యూస్ : రోజా విషయంలో జగన్ సంచలన నిర్ణయం..ఇక పండగే!

Tuesday, June 11th, 2019, 02:59:12 PM IST

గత కొన్ని రోజులు నుంచి యావత్తు వైసీపీ శ్రేణుల్లో కాస్త వెలితి ఏమన్నా ఉంది అంటే అది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మంత్రి వర్గంలో ఆ పార్టీ కీలక మహిళా నేత అయినటువంటి రోజాకు ఎలాంటి చోటు కల్పించకపోవడం అనే చెప్పాలి.అసలు రోజా విషయంలో జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని వారు అస్సలు ఊహించి ఉండరు.అందువల్ల రోజాకు ఎలాంటి మంత్రి పదవి దక్కక పోవడంతో చాలా మంది నిరాశకు లోనయ్యారు.అంతే కాకుండా రోజా కూడా మంత్రి పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ మంత్రి వర్గంలో తన పేరు లేకపోయే సరికి రోజా తీవ్ర నిరాశకు లోనయ్యారు.కనీసం ప్రమాణ స్వీకారంకు కూడా వెళ్లక పోగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టుకుని హైదరాబాద్ లో ఉండిపోయారని తెలిసింది.కానీ ఇప్పుడు రోజా విషయంలో ఎవరెవరు అయితే బాధ పడుతున్నారో వారందరికీ శుభ వార్త అందే సూచనలు ఉన్నాయా అంటే అవుననే చెప్పాలని అంటున్నారు.తాజాగా వై ఎస్ జగన్ రోజాకు ఫోన్ చేసి అమరావతి రావాల్సిందిగా కోరడంతో రోజా హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు రోజా విషయంలో జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని,ఆమెకు మంత్రి పదవి దక్కకపోడంతో రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని అయితే దీనిపైనే విజయసాయి రెడ్డితో కూడా జగన్ చర్చలు నడుపుతున్నారని ఒకపక్క ఎమ్మెల్యేగా ఉంటూ చైర్ పర్సన్ గా ఉండొచ్చో లేదో అన్న దానిపైనే కసరత్తులు చేస్తున్నారని సమాచారం.దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.మొత్తానికి జగన్ రోజా ఇన్నాళ్లు పార్టీకోసం వెచ్చించిన శ్రమకు జగన్ తగిన ప్రతిఫలం ఇవ్వనున్నారని విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.