బ్రేకింగ్ న్యూస్ : విజయసాయి రెడ్డి విషయంలో జగన్ సంచలన నిర్ణయం.?

Wednesday, June 5th, 2019, 11:02:33 AM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత ఇప్పుడు అధికారులు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొని మెప్పు పొందుతున్న నవ యువ ముఖ్యమంత్రి తన క్యాబినెట్ కు సంబంధించి కూడా ఇప్పుడు తాజా సమాచారం బయటకు వచ్చింది.వైసీపీలో జగన్ తర్వాత మళ్ళీ అంత కీలక నేత భావించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది విజయసాయి రెడ్డే అని చెప్పొచ్చు.ఇప్పుడు జగన్ విజయసాయి రెడ్డి సహా మరో ఇద్దరికి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది.

ఈ నెల 12 నుంచి మొట్ట మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఒక ప్రోటెం స్పీకర్ గా సంబంగి చిన అప్పలనాయుడును నియమించినట్టు తెలుస్తుంది.అంతే కాకుండా పార్లమెంటరీ పార్టీ నాయకునిగా విజయ సాయి రెడ్డిను జగన్ నియమించారట.అంతే కాకుండా పార్టీ చీఫ్ విఫ్ గా మార్గాని భరత్ ను అలాగే లోక్ సభలోని వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని జగన్ నియామకం చేశారట.మొత్తానికి జగన్ మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత దూకుడుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నరని చెప్పాలి.