బిగ్ బ్రేకింగ్: జగన్ సంచలనాత్మక నిర్ణయం.. భయం గుప్పిట్లో టీడీపీ నేతలు..!

Friday, June 14th, 2019, 11:21:52 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. వీటన్నిటిని చూసుకుంటూనే గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడంపై కూడా దృష్టి సారించారు.

అయితే ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కుంబకోణాలు జరిగాయో అందరికి తెలిసిన విషయమే. అయితే అందులోనే భాగంగా రాజధానిని ఎక్కడ నిర్మించాలో ముందుగానే అనుకుని చంద్రబాబు బినామీలఅతో తక్కువ రేటుకు అమరావతిలో బూములు కొనుగోలు చేయించారన్నారు. అంటే చంద్రబాబు ఇన్-సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడినట్లు తెలుస్తుంది. కొంత మంది టీడీపీ నేతలు లాండ్ పూలింగ్ పేరుతో అమాయక ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని దానిని ఆధారాలతో సహా భయటపెడతానని చెప్పుకొచ్చారు సీఎం జగన్. అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు బినామి పేర్లపై తక్కువ ధరలకు భూములు కొన్నారు.

అయితే వీరిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించనుంది. అందులో మాజీ మంత్రి నారాయణ బినామీ పేర్లతో 432 కోట్లు పెట్టి 3129 ఎకరాలు కొన్నారు. సుజనా చౌదరి ఈయన 35 కోట్లతో 700 ఎకరాలు కొనుగోలు చెయగా ప్రస్తుతం వీటి ధర 700 కోట్లకు మారింది. నారా లోకేశ్ 50 కోట్లు పెట్టి 500 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం వీటి ధర 650 కోట్లకు పెరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు 39 కోట్లు పెట్టి 196 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం దాని విలువ 784 కోట్లకు పెరిగింది. రావెల కిషోర్ బాబు 5.5 కోట్లు పెట్టి 55 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం వీటి ధర 82.5 కోట్లకు పెరిగింది. మురళీ మోహన్ 16 కోట్లు పెట్తి 53 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం వీటి విలువ 213 కోట్లు పెరిగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతలలో చాలా మంది బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ భూముల కుంభకోణంపై ప్రత్యేక దృష్టి సారించి వీరి పని పట్టే పనిలో సీఎం జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ భూముల విషయంలో జగ్న్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ నేతలు భయం గుప్పిట్లో ఉన్నారట.