ఇప్పుడు జగన్ టైం స్టార్ట్ అయిందిగా..ఇక ముందు ఎలా ఉంటుందో?

Sunday, September 22nd, 2019, 10:36:32 AM IST

వైసీపీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైం ఇప్పుడు మాములుగా లేదని చెప్పాలి.అసలు ఊహించని స్థాయి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.దీనితో ఇక జగన్ టైం స్టార్ట్ అయ్యిందని వైసీపీ అభిమానులు అనుకున్నారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ తనదైన మార్క్ పాలనను అందిస్తున్నారని వైసీపీ అభిమానులు భావిస్తున్నా జగన్ హవా మాత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తగ్గడం లేదని తాజగా చోటి చేసుకుంటున్న పరిణామాలు చూస్తేనే అర్ధం అవుతుంది.

ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగుదేశం పార్టీ ఘోరమైన పరాభవాన్ని చూసింది.దీనితో టీడీపీ మొత్తం వైసీపీను కాదని భారీ మొత్తంలో బీజేపీ లో చేరిపోయారు.కానీ ఇప్పుడు మాత్రం జగన్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.ఇప్పుడు బీజేపీలోకి చేరికలు ఆగిపోయి వైసీపీలో అందులోను టీడీపీ కీలక నేతలు అయిన వారు వచ్చి చేరుతున్నారు.మరి ఇక ముందు నుంచి ఇంకెంత మంది వచ్చి చేరుతారో చూడాలి.ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళి అయ్యిపోయేలా ఉందని చెప్పాలి.