దెబ్బకు దెబ్బ..జగన్ టైం మాములుగా లేదుగా.!

Wednesday, September 11th, 2019, 10:11:50 AM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు సర్వత్రా ఆసక్తిగా మారుతున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీను కక్ష పూరితంగానే టార్గెట్ చేస్తూ తమ పార్టీ అభిమానులను మరియు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ వారై బెదిరింపు మరియు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.అందులో భాగంగానే పల్నాడు రాజకీయాలు మరింత వేడెక్కడంతో “ఛలో ఆత్మకూరు” అనే నినాదంతో యావత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునివ్వగా అందుకుగాను జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఇది మాత్రం చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బే అని చెప్పాలి.అక్కడకు వస్తున్న ఏ ఒక్క తెలుగు తమ్ముళ్లను పోలీసు శాఖ వారు వదిలిపెట్టలేదు.

అంతే కాకుండా చంద్రబాబును కూడా హౌస్ అరెస్ట్ చేసి షాకిచ్చారు.అయితే గతంలో ప్రత్యేక హోదా విషయంలో జగన్ ను విశాఖ జిల్లాలో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం అధిష్టానం పోలీసు శాఖతో ఆపించిన సంఘటన వైసీపీ వారు మర్చిపోలేరు.ఇప్పుడు అలాంటి ఘటనే మళ్ళీ చంద్రబాబుకు ఎదురయ్యిందని చెప్పొచ్చు.ఈ ఛలో ఆత్మకూరు అనే అంశం అనేది చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అలాంటి దీనికే జగన్ వేసిన దెబ్బ మాత్రం చంద్రబాబుకు గట్టిగా తగిలిందే అని చెప్పాలి.మొత్తానికి జగన్ టైం మాత్రం ఇప్పుడు మాములుగా లేదని చెప్పాలి.