బీజేపీకి చెక్ పెట్టనున్న జగన్ – ఎంత వరకు నిజం…?

Friday, July 12th, 2019, 08:41:25 PM IST

కేంద్రంలో రెండవసారి అధికారాన్ని సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ద్రుష్టి అంత కూడా ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి అనుగుణంగా అందరు నేతలను కూడా తన పార్టీలోకి ఆకర్షిస్తుంది బీజేపీ. ఇప్పటికే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుండి అందరు ప్రముఖ నాయకులందరినీ కూడా బీజేపీ పార్టీ ఆకర్షించి తన పార్టీలో కలుపుకుంది కూడా. అంటే ఏపీలో బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ని టార్గెట్ చేసి మరీ ముందుకెళ్తుంది. అన్దుకనే టీడీపీలో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా లాక్కొని టీడీపీ పార్టీ క్యాడర్ ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులని మాత్రం కలుపుకోడానికి ప్రయత్నాలు చేయడమే లేదని సమాచారం. అయితే కేంద్రంలో తమతో సఖ్యతగానే మెలుగుతున్నారని, అందుకనే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మీద బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేయడం లేదని సమాచారం. కాకపోతే ఏపీలో టీడీపీ నేతలందరినీ కూడా తమవైపు తిప్పుకున్న తరువాత వైసీపీ నేతల మీద తమ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే కొందరు బీజేపీ నేతలు మాత్రం ఏపీలో వైసీపీ కి ప్రత్యామ్నాయం మేమె అని కొందరు బీజేపీ నేతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయాన్నీ ముందుగానే గమనిస్తున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీలో బీజేపీ పార్టీ కి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని పార్లమెంటులో బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసారు. ఈమేరకు ఏపీలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా అనేది కల అని పలు వాఖ్యలు చేస్తున్నారని సమాచారం.

కానీ ఈవిషయంలో మాత్రం వైసీపీ నేతలు అసలే వెనక్కి తగ్గడం లేదని సమాచారం. కనీసం ఈ ప్రత్యేక హోదా అంశంతోనే బీజేపీ కి చెక్ పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉంటేనే బీజేపీ బలపడేందుకు అవకాశాలు సన్నగిల్లుతాయని వైసీపీ భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ పార్టీ ని ప్రజలు అసలే నమ్మరని అందుకే ఇలాంటి అంశాన్ని జగన్ ప్రతీసారి ప్రస్తవించొచ్చు అని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం.