లోకేష్ పదవిని జగన్ ఇవ్వబోయేది ఆమెకేనా?

Tuesday, June 4th, 2019, 03:44:39 PM IST

వైఎస్ జగన్ చాలా తెలివిగా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని పదవుల్ని ముందుగా మాట ఇచ్చిన వారికి కట్టబెడుతున్నా కీలకమైన శాఖలకి మాత్రం సామర్థ్యాన్ని చూసే ఎంపిక చేస్తున్నారు. రాష్ట్రా అభివృద్దిలో కీలక పాత్ర పోషించే వాటిలో ఐటీ శాఖ కుడా ఒకటి. చంద్రబాబు హయాంలో ఆ శాఖను ఆయన కుమారుడు లోకేష్ నిర్వహించగా ఇప్పుడు జగన్ ఆ శాఖను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజనీకి అప్పగించాలని అనుకుంటున్నారట.

ఎందుకంటే మంచి విద్యావంతురాలు కావడం, అమెరికాలోని సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమె అయితే శాఖను సమర్థవంతంగా నిర్వహించగలదని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు రజనీకి కొన్ని బడా సాఫ్ట్ వేర్ కంపెనీలతో మంచి అనుబంధం ఉండటంతో రాష్ట్రానికి కొత్త ఐటీ కంపెనీలను ఆమె తీసుకురాగలదని, అందుకే ఆమె అయితేనే అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందనే చర్చ పార్టీలో నడుస్తోంది.