బిగ్ బ్రేకింగ్ : మంత్రి కొడాలి నానికి షాక్..మంత్రి పదవి పోయినట్టేనా?

Wednesday, November 20th, 2019, 09:02:45 AM IST

గత రెండు రోజుల క్రితం వైసీపీ మంత్రి అయినటువంటి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడ్డ సంగతి అందరికి తెలిసిందే.టీడీపీ నేత అయినటువంటి దేవినేని ఉమ పై మరియు తిరుమల దేవస్థానంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.అయితే ఉమాను బండ బూతులు తిట్టినా వారు ఏమీ చెయ్యలేకపోయారు కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానంపై చేసిన కామెంట్స్ మాత్రం బీజేపీ నేతల్లో అలజడి రేపింది.

తిరుమలను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేఖంగా మరియు హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని దీనిపై జగన్ సరైన వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలు అంటున్నారు.అలాగే నానిపై పలువురు బీజేపీ నేతలు కూడా కంప్లైంట్ ఇచ్చారు.కొడాలి నాని అన్న మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని అంతే కాకుండా అలాంటి వ్యక్తిని మంత్రి పదవి నుంచి జగన్ తొలగించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే జగన్ హిందూ వ్యతిరేఖిగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని నేషనల్ మీడియా వరకు వెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యిపోయింది.ఈ సమయంలో కానీ జగన్ ఎలాంటి వివరణను ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు అంత త్వరగా వదిలేలా లేరని చెప్పాలి.