జగన్ గదిలోకి దూసుకుపోయిన టిడిపి కార్యకర్తలు..!

Tuesday, February 28th, 2017, 06:02:33 PM IST

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా జిల్లా బస్సు ప్రమాదమైన స్థలాన్నిపరిశీలించిన అనంతరం క్షతగాత్రులను పరామర్శించడానికి నందిగామ వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జగన్ వస్తున్నాడన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలు జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనితో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.టిడిపి కార్యకర్తలు ఆసుపత్రిలో జగన్ ఉన్న గదిలోకి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న వైసిపి కార్యకర్తలు కూడా పోటా పోటీగా నినాదాలు చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ 20 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని అయన డిమాండ్ చేశారు. బస్సు డ్రైవర్ మృత దేహానికి పోస్ట్ మార్టం ఎందుకు నిర్వహించలేదని జగన్ ప్రశ్నించారు. రెండో డ్రైవర్ ఎక్కెడికి వెళ్లాడని కూడా ఆయన నిలదీశారు. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు జేసీ దివాకర్ రెడ్డి ‘దివాకర్ ట్రావెల్స్ ‘కి చెందినది.